అస‌ద్ గొంతు మీద క‌త్తి పెడ‌తానంటున్నాడు

అస‌ద్ గొంతు మీద క‌త్తి పెడ‌తానంటున్నాడు

తన గొంతు మీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని తాను అననంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. ఆయన ఏ ముహుర్తంలో ఈ వ్యాఖ్యలు చేశారో.. రోజురోజుకీ ఈ వివాదం పెరుగుతుందే తప్పించి ఎంతకూ తగ్గటం లేదు. రోజుకో రూపు తీసుకుంటున్న ఈ వివాదంపై మహారాష్ట్రకు చెందిన మరాఠా ఫైర్ బ్రాండ్ రాజ్ ఠాక్రే తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితమే ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మాట్లాడుతూ.. చట్టాల్ని గౌరవించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయని వారిని లక్షలాది మందిని ఊచకోత కోయకుండా ఉన్నట్లుగా వ్యాఖ్యానించారు.

ఇలాంటి వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి. తాజాగా ముంబయిలోని ప్రఖ్యాత శివాజీ పార్కులో శుక్రవారం రాత్రి జరిగిన ఒక సభలో మాట్లాడిన రాజ్ఠాక్రే మజ్లిస్ అధినేత అసద్ వ్యాఖ్యాల్ని ప్రస్తావిస్తూ.. మహారాష్ట్రకు రా.. నీ మెడపై కత్తి పెడతా.. అప్పుడు భారత్ మాతాకీ జై అని ఎందుకు అనవో చూస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు మరింత ఉద్రేకాన్ని పెంచుతాయన్న విషయాన్ని నాయకులు గుర్తిస్తే బాగుంటుంది. ప్రస్తుత దూకుడు రాజకీయాల్లో అలాంటివి ఆశించలేమేమో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English