వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో అద్భుతాలు చేస్తాడట

వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో అద్భుతాలు చేస్తాడట

నుంచి బయటకు వచ్చేసి టీడీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్న సీనియర్ కాపు నేత జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు పాలన ఏమంత నచ్చలేదట. టీడీపీలో చేరడానికి ముందే ఆయన ఈ మాట చెబుతున్నారు. అయితే, నెహ్రూ చేరిక అవసరం కావడంతో ఆయన అంతడేసి మాటలన్నా కూడా టీడీపీ నేతలు కిమ్మనకుండా ఉన్నారు.

జ్యోతుల నెహ్రూ తాజాగా ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చారు. తమ సామాజికవర్గానికి చెందిన చిరంజీవి సీఎం అవుతారన్న ఆశతోనే ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లానని చెప్పారు. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని.. ఈ లక్షణం వల్లే గతంలో చంద్రబాబు వద్ద ఇబ్బంది పడి బయటకు వచ్చేశానని.. అయితే, ఈసారి ఆ పరిస్థితి ఉండదని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని జ్యోతుల అన్నారు. చంద్రబాబు పాలన అంత అద్భుతంగా ఏమీ లేదని కూడా అన్నారు. అలాంటప్పుడు మరి ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారని అడగ్గా.. తాను వెళ్లి టీడీపీలో అద్భుతాలు చేయాలనుకుంటున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు