కేసీఆర్ ను బుక్ చేస్తామంటూ బుక్ అవుతున్నారు

కేసీఆర్ ను బుక్ చేస్తామంటూ బుక్ అవుతున్నారు

తప్పులు ఎత్తి చూపించే వాళ్లు.. తొలుత ఎదుటోళ్లు చెప్పే మాటల్ని శ్రద్ధగా వినాలి. వారి వాదనను తాము వింటామని.. తర్వాత తమ వాదనను వినిపిస్తామని చెప్పాలి. అలాకాకుండా మీరు చెప్పేది మేం వినం.. మేం చెప్పిది మాత్రం మీరు వినాలన్న మొండివాదన ఏ మాత్రం బాగోదు. ప్రజలు కూడా ఈ తరహా వైఖరిని ఏమాత్రం ఇష్టపడరు. తెలంగాణకాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తీరు చూస్తే ఇదే రీతిలో ఉంది.

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్  సందర్భంగా అసెంబ్లీకి హాజరు కాకుండా ఉన్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ప్రజంటేషన్ కు కౌంటర్ ప్రజంటేషన్ ఇస్తామని.. అందుకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాలంటూ చిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చింది.నిజానికి.. ప్రభుత్వం ప్రజంటేషన్ ఇచ్చిన తర్వాత.. తమ వాదనను కూడా చెప్పేందుకు వీలుగా తమకు అవకాశం ఇవ్వాలని అడిగి ఉంటే బాగుండేది.

అలాంటిదేమీ లేకుండా కేసీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్ ను బాయ్ కాట్ చేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ప్రభుత్వానికి పోటీగా తాము కూడా ప్రజంటేషన్ ఇస్తామని చెబుతున్నారు. తాజాగా వారు చేస్తున్న వాదనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చెప్పే మాటల్ని వినకుండా.. తాము చెప్పే మాటల్ని మాత్రమే వినాలనటం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీ కాంగ్రెస్ నేతలు తీరు చూస్తే.. కేసీఆర్ ను బుక్ చేద్దామన్నట్లుగా వారు చేస్తున్న విమర్శలు.. తామే బుక్ అయిపోతున్న విషయాన్ని గుర్తించనట్లుగా కనిపిస్తోంది.ఇలాంటి వైఖరినే సెల్ప్ గోల్ అంటారన్న విషయాన్ని టీ కాంగ్రెస్ నేతలు గుర్తిస్తే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు