రోజా బ్లూ ఫిల్మ్.. వాస్తవమెంత?

రోజా బ్లూ ఫిల్మ్.. వాస్తవమెంత?

ఒక ఎమ్మెల్యేను పట్టుకుని ఒక విలేకరి.. ‘‘మీరు బ్లూఫిల్మ్‌లో నటించారా’’ అని అడగడం ఎక్కడైనా చూశారా..? తెలుగు రాష్ట్రంలో మాత్రం ఈ విడ్డూరం చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాను ఓ టీవీ ఛానెల్ విలేకరి ఈ ప్రశ్న అడిగి సంచలనానికి తెరతీశాడు. రోజా ఆ విలేకరిని తనదైన శైలిలో గట్టిగానే ఎదుర్కొంటుందనుకోండి. ఐతే ఆ విలేకరికి అలాంటి ప్రశ్న అడగాలన్న ఆలోచన రావడానికి కారణం తెలుగుదేశం నాయకులే. రోజా బ్లూ ఫిల్మ్‌లో నటించిందన్న ప్రచారానికి తెరతీసింది ఆ పార్టీ నాయకులే. రోజా రాజకీయమంతా నోటి దురుసుతోనే ముడిపడి ఉంటుంది. తెలుగు దేశం వాళ్లు ఏం పీకుతారు.. నన్ను రేప్ చేస్తారా అంటూ ఓసారి రెచ్చిపోవడం.. ఎమ్మెల్యే అనిత గురించి చేసిన వ్యాఖ్యలు రోజా ఏంటో జనాలకు తెలియజెప్పాయి. అలాంటి పొలిటీషియన్ని ఎదుర్కోవడానికి ఆమె రూట్లోనే వెళ్తున్న తెలుగు దేశం నాయకులు ఓసారి ఆమె బ్లూ ఫిలింలో నటించిందన్న ప్రచారానికి తెరతీశారు.

నిజానికి ఇందులో వాస్తవం ఏమీ లేదు. ప్రముఖ హీరోయిన్లను పోలిన ముఖంతో ఉన్న అమ్మాయిలతో శృంగార వీడియోలు తీసి నెట్లో పెట్టడం చస్తూనే ఉంటాం. అలాగే మలయాళంలో రోజా పోలికలతో ఉన్న అమ్మాయి చేసిన శృంగార సన్నివేశాన్ని చూసి.. ఆమె రోజానే అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు కొందరు జనాలు. ఇలాంటి పైశాచిక ఆనందం నెటిజన్లు చాలామందికి ఉంటుంది. అలా వాట్సాప్ లో ప్రచారంలోకి వచ్చిన ఓ వీడియో పొలిటీషన్ల వరకు చేరి.. వాళ్లు రోజా మీద అలాంటి ఆరోపణలకు తెరతీశారు. కానీ ఓ ఎమ్మెల్యే మీద ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం దారుణం. దాని మీద మళ్లీ ఓ విలేకరి ప్రశ్నించడం ఇంకా ఘోరం. కనీసం ఈ ప్రశ్నను ఖండిస్తూ వివరణ ఇచ్చుకోవడం కూడా కష్టమన్న ఇంగితం లేకుండా ఇలా అడగడం సమంజసం కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English