మాస్‌ హీరోనే.. నమ్మండి!

మాస్‌ హీరోనే.. నమ్మండి!

మనోడు ఎన్ని మాస్‌ వేషాలేసిన ఇప్పటివరకు ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకంటే ఆ మాస్‌ వేషాలతో ఎవ్వరినీ ఆకట్టుకేలకపోయాడు కాబట్టి, మనోడికి అంత సీన్‌ లేదనే అన్నారు. కాని ఇకనైనా మన యంగ్‌ రొమాంటిక్‌ హీరోను మాస్‌ హీరో అంటే నమ్మాలని అక్కినేని అభిమానులు చెబుతున్నారు.

మొట్టమొదటిసారిగా ఒక మాస్‌ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్టు కొట్టాడు నాగ చైతన్య. తడాఖాకు వచ్చిన పాజిటివ్‌ రిపోర్ట్స్‌, అందులో మనోడు చేసిన కామెడి, రొమాన్స్‌, యాక్షన్‌లకు వచ్చిన పేరును చూస్తుంటే ఖచ్చితంగా మాస్‌ హీరో అన్నట్లే ఉన్నాడు. సినిమా కూడా ఒక రేంజ్‌లో కలెక్షన్లు వసూలుచేస్తే, చైతన్యకు మాస్‌ ఇమేజ్‌ బాగానే వస్తుంది. మరి ఒక్క హిట్టుకే మాస్‌ హీరో అనేయాలా లేదా అనే విషయం తెలియాలంటే మనోడు ఖచ్చితంగా ఇలాంటి మరో రెండు హిట్లు కొట్టాల్సిందే అంటున్నారు విమర్శకులు.

త్వరలో ఆ ఆటోనగర్‌ సూర్య, ఆ తరువాత హలోబ్రదర్‌ రీమేక్‌ పడ్డాయంటే అప్పుడు ఖచ్చితంగా మనోడు మాస్‌ హీరో అని అందరూ నమ్ముతారు. ఏమంటారు బాస్‌?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు