జ్యోతుల నెహ్రూ ముహూర్తం ఖరారైంది..

జ్యోతుల నెహ్రూ ముహూర్తం ఖరారైంది..

వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇక ఆ పార్టీలో కొనసాగలేనని చెప్పేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు కూడా. ఇక టీడీపీలో ఆయన చేరడమే తరువాయి. అయితే... అందుకు కూడా ముహూర్తం ఖరారైపోయిందట.. ఆయన ఎప్పుడు చేరుతారన్నది ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు జ్యోతుల టీడీపీ కండువా కప్పుకుంటారని యనమల ప్రకటించారు.

విజయవాడలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో జ్యోతుల నెహ్రూ పార్టీలో చేరుతారట. కాగా, అంతకుముందే ఈ నెల 8వ తేదీన చంద్రబాబు సమక్షంలో వరుపుల సుబ్బారావు కూడా టీడీపీలో చేరనున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ అధినేత తీరుపై అసహనంగా ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇటీవల వైసీపీలో పీఏసీ ఛైర్మన పదవిని జూనియర్ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇవ్వడంతో జ్యోతుల అలిగారు.. ఆయన అసంతృప్తిని మరింత రగిలించేలా జగన్ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో జ్యోతులు మనస్తాపం చెందారు. దాంతో వైసీపీలో అవమానాలు భరించేకంటే టీడీపీలో చేరడం నయమని భావించి అందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు