ఇదీ.. సరేఖ చెబుతున్న డ్రెస్ కోడ్

ఇదీ.. సరేఖ చెబుతున్న డ్రెస్ కోడ్

తెలుగు రాష్ట్రాల్లో కొండా సురేఖ పేరును తెలియని వారు చాలా అరుదుగా ఉంటారు.రాజకీయాల మీద ఏ మాత్రం అవగాహన ఉన్నా.. కొండా సురేఖ సుపరిచితం. తాజాగా ఆమె ఆసక్తికర విషయం ఒకటి చెప్పుకొచ్చారు. నిజానికి.. చాలామంది బయటకు చెప్పేందుకు ఇష్టపడని ఒక అంశాన్ని దైర్యంగా చెప్పటమే కాదు.. దాని అవసరాన్ని వివరించి చెప్పారు. మరి.. ఆమె మాటను రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తే మంచిదన్న భావన వ్యక్తమవుతోంది.

ఇంతకీ.. కొండా సురేఖ చెప్పిన ఆ విషయం ఏమిటంటే.. స్కూళ్లలో ఆడపిల్లలకు లైంగిక వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు డ్రెస్ కోడ్ ను మార్చటం అవసరమని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పదో తరగతి అమ్మాయిల డ్రెస్ కోడ్ ను ఇప్పుడు వాడుతున్న డ్రెస్ కన్నా.. సల్వార్ కమీజ్ వంటివి వాడటం మంచిదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు.

సల్వార్ కమీజ్ కారణంగా శరీరం మొత్తం కవర్ అవుతుందని.. దీని వల్ల లైంగిక వేధింపులు తగ్గే వీలుందని చెప్పుకొచ్చారు. పదో తరగతి ఆడపిల్లల డ్రెస్ కోడ్ ను తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. నిజానికి.. స్కూళ్లల్లో ఇప్పుడున్న యూనిఫాంతో తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్న వేలాది మంది అమ్మాయిల మనోభావాల్ని తెలియజెప్పేలా కొండా సురేఖ మాటలున్నాయి. మంచి ఆలోచన చేశారమ్మా మీరు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు