ప్రపంచంలోని తొలి భారీ నీటిపారుదల ప్రాజెక్టు తెలంగాణలోనే..

ప్రపంచంలోని తొలి భారీ నీటిపారుదల ప్రాజెక్టు తెలంగాణలోనే..

సాగునీటి ప్రాజెక్టులపై టీ అసెంబ్లీలో మాట్లాడుతున్న  కేసీఆర్ జలవిధానం, ప్రాజెక్టుల పునరాకృతి, కొత్త పథకాల రూపకల్పన గురించి కేసీఆర్ వివరించారు. 75 వేలకు పైగా చెరువులు కాకతీయులు నిర్మించారని, కులీకుతుబ్ షా హుస్సేన్ సాగర్ నిర్మించారని, కాకతీయులు, రెడ్డిరాజుల స్ఫూర్తిని కులీకుతుబ్ షా కొనసాగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి 11 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, అంతర్రాష్ట్ర వివాదాల్లో కూరుకుని ముందుకుపోని ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతుల్లో మరికొన్ని ప్రాజెక్టులు ఇరుక్కపోయాయన్నారు. గోదావరిలో రాష్ట్రానికి రావాల్సింది 954 టీఎంసీలు, కృష్ణాలో 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.  ప్రపంచంలోనే తొలి భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ అని ఆయన చెప్పారు.

పాలమూరు ఎత్తిపోతలను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టి తీరుతామని స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు మహబూబ్‌నగర్ జిల్లా నేతలే హైకోర్టులో పిల్ వేశారని గుర్తు చేశారు. హైకోర్టు దానిని కొట్టివేసి ప్రాజెక్టును కట్టేందుకు అనుమతించిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును కట్టి తీరుతామన్నారు. ఆకుపచ్చ, హరిత తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇన్ని ఆటంకాలు సృష్టించినా, అవరోధాలు కల్పించినా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని చెప్పారు. తప్పకుండా సాగునీరు తెస్తాం, తెలంగాణ రైతు కన్నీళ్లు తుడుస్తామని పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు