చంద్రబాబు పోచారంను ఎందుకు కొట్టారంటే...

చంద్రబాబు పోచారంను ఎందుకు కొట్టారంటే...

తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలసిందే.  టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనను ఓసారి కొట్టారని ఆయన చెప్పడం రెండు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. అయితే.. ఆయన ఎందుకు కొట్టారన్నది కూడా పోచారం చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం నిజాం షుగర్సు ప్రైవేటీకరణపై జరిగిన చర్చ సందర్భంగా పోచారం ఈ ఆరోపణలు చేశారు.

అప్పట్లో తాను నిజాం షుగర్సును ప్రైవేటీకరించవద్దని ప్రతిపాదించానని... దాంతో చంద్రబాబు తనపై మండిపడ్డారని అంతేకాదు.. తనపై అంతెత్తున ఎగిరిన చంద్రబాబు అంతటితో ఆగకుండా తనపై చేయిచేసుకున్నారని కూడా చెప్పారు. ఈ విషయాన్ని తాను అప్పట్లో బయటపెట్టలేదని... తొలిసారిగా ఆ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు.  ప్రైవేటీకరణ వద్దని చేతులు జోడించి వేడుకుంటే చంద్రబాబు వద్ద తనకు జరిగిన సత్కారం దెబ్బలేనని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా పోచారం వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టీడీపీ నుంచి కానీ, చంద్రబాబు వైపు నుంచి కానీ దానిపై ఇంతవరకు ఖండన రాలేదు. ఇంతకాలం ఎవరూ చెప్పని విషయం పోచారం నోటి వెంట రావడంతో అది నిజమా కాదా అన్న చర్చ సాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English