జూనియర్ ఎన్టీఆర్‌ను వాడేస్తున్న రోజా

జూనియర్ ఎన్టీఆర్‌ను వాడేస్తున్న రోజా

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాకు ఉన్నట్లుండి జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. తనపై ఏడాది నిషేధం విధించడంపై.. అసెంబ్లీకి అనుమతించకపోవడంపై.. ఈ రోజు ఢిల్లీలోని సుప్రీం కోర్టును ఆశ్రయించిన రోజా.. అక్కడ మీడియా వాళ్లతో మాట్లాడుతూ ఆశ్చర్యకరంగా జూనియర్ ఎన్టీఆర్ మీదికి టాపిక్ మళ్లించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేుసింది.

ఎన్టీఆర్ అనే పేరంటేనే చంద్ర‌బాబుకు ఏమాత్రం ఇష్టం లేదని.. అందుకే జూనీయ‌ర్ ఎన్టీఆర్‌ను ఇనుప పాదంతో బాబు తొక్కేస్తున్నాడని ఆరోపించింది రోజా. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్టీఆర్‌ను బాబు బాగా వాడుకుని.. ఆ తర్వాత వదిలేశాడని... క‌నీసం ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌గా కూడా గుర్తించ‌డం లేదని విమర్శించింది రోజా. ఎన్టీఆర్ సినిమాలు విడుద‌ల కానివ్వ‌కుండా.. ఆడ‌నివ్వకుండా చంద్రబాబు అండ్ కో తొక్కేస్తున్నారని కూడా రోజా ఆరోపించడం విశేషం.

జూనీయ‌ర్ ఎన్టీఆర్ ఛ‌రిష్మా ముందు త‌న ప‌ప్పు సుద్ద కొడుకు లోకేష్ ఎద‌గ‌లేడ‌నే భ‌యంతోనే తారక్‌ను తొక్కేస్తున్నారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐతే తెలుగుదేశం పార్టీకి.. జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య నడుస్తున్న వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. కొత్తగా చెప్పేదేం లేదు. రోజా తన కేసుకు సంబంధించి ఢిల్లీకి వెళ్లి.. ఎన్టీఆర్ వ్యవహారం ఎందుకు ఎత్తిందన్నదే అర్థం కావడం లేదు. అటెన్షన్ కోసం అవసరం లేకున్నా జూనియర్ పేరును ఇలా వాడేయడమే విడ్డూరంగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు