జంపింగ్‌పై జ్యోతుల క్లారిటీ ఇచ్చారు

జంపింగ్‌పై జ్యోతుల క్లారిటీ ఇచ్చారు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశంలో చేరే విష‌యమై వైసీపీ శాస‌న‌స‌భా ప‌క్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ క్లారిటీ ఇచ్చారు.  వైకాపా విధానాల పట్ల త‌న‌కున్న అసంతృప్తిని పార్టీ అధినేత జగన్‌కు వివరించానని నెహ్రూ చెప్పారు. వైసీపీ నుంచి వైదొలిగే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని పేర్కొంటూ ఇక మాట్లాడవలసిందేమీ లేదని ఆయన వివ‌రించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీని వీడే విషయమై కార్యకర్తలతో చర్చిస్తున్నానని చెప్పిన నెహ్రూ అధికార పార్టీలో చేరితే అభివృద్ధి సాధ్యమని కార్యకర్తలు సూచిస్తున్నారని ప‌రోక్షంగా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

వైసీపీ పార్టీ విధానాలతో విబేధిస్తున్నాన‌ని చెప్పిన నెహ్రూ త‌న‌ను పార్టీలోకి రావాల్సిందిగా టీడీపీ శ్రేణులు ఆహ్వానించాయ‌ని ప్ర‌క‌టించారు. జ్యోతుల నెహ్రూ ఈ రోజు సైతం అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకాలేదు. దీంతో పార్టీ మార్పుపై ఆయ‌న డిసైడ‌యిన‌ట్లు రాజ‌కీయ‌వ‌ర్గాలు డిసైడ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడిన నెహ్రూ ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు