కేంద్ర మంత్రి మాటఃజేఎన్‌యూలో జిహాదీలు

కేంద్ర మంత్రి మాటఃజేఎన్‌యూలో జిహాదీలు

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ (హెచ్‌సీయూ), జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ (జేఎన్‌యూ)లో జ‌రుగుతున్న విద్యార్థి ఉద్య‌మాల్లో మ‌రో హీట్ రాజుకుంది. ఈ రెండు ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీల్లో జిహాదీలు ఉన్నార‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు.  ఈ రోజు కొందరు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన జేఎన్‌యూ, హెచ్‌సీయూల‌పై ఈ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

ఈ రెండు యూనివ‌ర్సిటీల‌లో జరిగిన వామపక్ష అతివాద ఉద్యమాలలో కొందరు జిహాదీలు కూడా ఉన్నారని జైట్లీ అన్నారు. ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారిలో అత్యధికులు వామపక్ష అతివాదులు కాగా అతి కొద్ది మంది జిహాదీలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. వారే గత నెల 9వ తేదీన ముఖాలకు ముసుగులు ధరించి దేశ వ్యతిరేక నినాదాలు చేశారని జైట్లీ అన్నారు. ఇక హెచ్‌సీయూ విషయానికి వస్తే ఆ వర్సిటీ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటన తరువాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును అనవసరంగా ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ రెండు వర్సిటీలలోనూ జరిగిన సంఘటనలపై దేశ వ్యాప్తంగా జరిగిన చర్చలో మత, మైనారిటీ వర్గాలు, వారి నాయకులు పాలుపంచుకోకపోవడం పట్ల జైట్లీ సంతోషం వ్యక్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు