తెలంగాణ వైఎస్సార్ లో లాస్ట్ వికెట్ కూడా ఫట్..

తెలంగాణ వైఎస్సార్ లో లాస్ట్ వికెట్ కూడా ఫట్..

మనసులో మాట ఒకమాట. బయటకు మరోమాట. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి. అధికారమే లక్ష్యంగా పని చేసే ఆ పార్టీ.. రాష్ట్ర విభజన ప్రకటనతో ఒక్కసారి ప్లేటు ఫిరాయించింది. తెలంగాణలో ఆ పార్టీకి పట్టు లేని నేపథ్యంలో  తెలంగాణను పట్టుకొని వేలాడే కన్నా.. సీమాంధ్రపై దృష్టిపెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడటం  మొదలుపెట్టారు. తెలంగాణపై ఆల్ పార్టీ మీటింగ్ సమయంలో ఒకలా మాట్లాడిన ఆ పార్టీ ఇప్పుడు మరోలా మాట్లాడుతుంది. అన్నింటికి మించి ఇంతకాలం పార్టీని నమ్ముకున్నతెలంగాణ నేతల పట్ల.. మీ ఇష్టం. ఉంటే ఉండండి.పోతే పోండని అనటంతో... ఇంతకాలం నమ్ముకున్న దానికి మంచి శాస్త్రే చేశారంటూ వెళ్లిపోవటం మొదలుపెట్టారు.

అలా.. చివరిగా మిగిలింది అదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి మాత్రమే. ఆయన కూడా ఒకటి రెండురోజుల్లో పార్టీకి రాజీనామా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వీరి బాటలోనే ఖమ్మం జిల్లాకు చెందిన మరో నేత పువ్వాడ అజయ్ కూడా వెళ్లిపోవటం ఖాయం అంటున్నారు. వీరిద్దరి వెళ్లిపోయినట్లే.. తెలంగాణలో పార్టీకి లాస్ట్ వికెట్ కూడా పడిపోయినట్లే. ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయిన కొండా సురేఖ అండ్ కో.. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో ఢిల్లీలోని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలిసి.. పార్టీలో చేరే అంశంపై మాట్లాడటమే మిగిలి ఉంది.  పార్టీ నేతల ప్రయోజనాల్ని కాపాడలేని వైఎస్సార్ కాంగ్రెస్.. ప్రజల ప్రయోజనాలను ఏ విధంగా రక్షిస్తుందంటారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు