టీడీపీ ఆక‌ర్ష్ ఫేజ్‌ 2: వైసీపీలో మ‌రో వికెట్ డౌన్‌!

టీడీపీ ఆక‌ర్ష్ ఫేజ్‌ 2:  వైసీపీలో మ‌రో వికెట్ డౌన్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ ఫేజ్ 2 మొద‌లైంది. ఇప్ప‌టికే 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సైకిలెక్క‌గా మ‌రో ఇద్ద‌రు శాస‌న‌స‌భ్యులు టీడీపీ కండువా క‌ప్పుకొనేందుకు స‌ర్వం రెడీ అయింది. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు టీడీపీలో చేర‌నున్న‌ట్లు వార్త‌లు షికార్లు చేశాయి. ఈ క్ర‌మంలోనే ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఈ రోజు కార్యకర్తలతో సుబ్బారావు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంత‌రం తాను టీడీపీలో చేరుతున్నట్లు కార్యకర్తల స‌మ‌క్షంలోనే సుబ్బారావు ప్ర‌క‌టించారు.

సుబ్బారావు పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ఏపీలో అధికార తెలుగుదేశం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఫేజ్‌2 మొద‌లైంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. అసెంబ్లీ స‌మావేశాలు పూర్త‌యిన త‌ర్వాత, ఉగాది లోపు వైసీపికి చెందిన పెద్ద ఎత్తున పార్టీలోకి చేర‌నున్న‌ట్లు టీడీపీ సీనియ‌ర్ నేత‌లు చెప్ప‌డం ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. ఇదిలాఉండ‌గా జ్యోతుల నెహ్రూకు సుబ్బారావు తోడ‌ల్లుడు అవుతారు. పార్టీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న త‌న‌లాంటి వారికే అన్యాయం జ‌రుగుతోంద‌న్న వాద‌న‌ను నెహ్రూ బ‌లంగా వినిపిస్తున్న నేప‌థ్యంలో...పార్టీ నుంచి మ‌రికొంద‌రు నేత‌లు వ‌ల‌స బాట ప‌ట్టే అవ‌కాశం ఉందని చెప్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు