విషమైనా తీసుకుంటాడు కానీ పార్టీ మారడంట

విషమైనా తీసుకుంటాడు కానీ పార్టీ మారడంట

సమయం వచ్చినప్పుడు విధేయత ప్రదర్శిస్తే ఆ లెక్కే వేరు. చూస్తుంటే.. ఏపీ విపక్షానికి చెందిన పేర్ని నాని అలియాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారపార్టీ ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య జగన్ పట్ల తనకున్న స్వామిభక్తిని చాటారు. పార్టీ మారతారంటూ వస్తున్న వార్తల్ని కొట్టిపారేస్తూ మీడియాతో మాట్లాడిన ఆయన భావోద్వేగంతో మాట్లాడటమే కాదు.. ఆయన మాటలు అధినేతకు అంతులేని నమ్మకం వచ్చేలా చేశారనటంలోసందేహం లేదు.

పదవుల గురించి ఆలోచించే వ్యక్తిత్వం తనది కాదని.. పార్టీ అంటే తనకున్న అభిమానం చాలానే అని చెప్పుకున్న ఆయన.. కాంగ్రెస్ లో తనకున్న పదవుల్ని వదిలిపెట్టి మరీ.. వైఎస్ మీద ఉన్న అభిమానంతో నాడు పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జగన్ మీద తనకున్న అభిమానం ఎంతన్నది చెబుతూ.. గొంతులో ప్రాణం ఉండగా పార్టీ నుంచి మారే అవకాశమే లేదని.. విషమైనా తీసుకుంటా కానీ పార్టీ మాత్రం మారనంటే మారనంటూ తేల్చి చెప్పటం గమనార్హం. అధినేత మనసును దోచుకునేలా మాట్లాడిన పేర్ని నాని మాటలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ మర్చిపోలేరని చెప్పాలి. కాకుంటే.. మాటల్లో ఉన్నంత కమిట్ మెంట్ చేతల్లో ఎన్ని రోజులు ప్రదర్శిస్తారన్నదే అసలుసిసలు ప్రశ్న.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు