చంద్రబాబు, కోడెలపై హైకోర్టులో పిటిషన్

చంద్రబాబు, కోడెలపై హైకోర్టులో పిటిషన్

వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, కోర్టు తీర్పు, అసెంబ్లీలోకి రానివ్వకపోవడం వంటి పరిణామాల అనంతరం ఆ వ్యవహారం మరో మలుపు తిరిగింది. రోజాను అసెంబ్లీలోకి అనుమతి నిరాకరించడం ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కోరుతూ న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఏపీ సీఎం, స్పీకర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో అభ్యర్థించారు. రోజా విషయంలో కోర్టు తీర్పును వారు గౌరవించలేదని, చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ధోరణులు పునరావృతమయ్యే అవకాశముందని అందులో ప్రస్తావించారు. ఇందుకు బాధ్యులైన స్పీకర్ కోడెల శివప్రసాద్, సభా నాయకుడు చంద్రబాబులపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిందేనని విజ్ఞప్తి చేశారు. ఈ పిల్ను స్వీకరించిన కోర్టు.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

మరోవైపు రోజా విషయంలో హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ ఏపీ శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీలుపై వాదనలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ పేరుతో తీర్పుపై అప్పీల్ చేయడం కుదరని రోజా తరఫు న్యాయవాది చెప్పారు. అధికార, ప్రతిపక్షాలను సిబ్బంది సమన్యాయంతో చూడాలని న్యాయవాది పేర్కొన్నారు. అసెంబ్లీ తీర్మానం కాపీలు రోజాకు ఇవ్వలేదని న్యాయవాది ఆరోపించారు. కాగా, రోజాకు తీర్మానం కాపీలు ఇచ్చామని పీపీ కోర్టుకు తెలిపారు. ఓ వైపు ప్రభుత్వం తరఫు నుంచి, మరోవైపు పిల్ పేరిట రోజా తరఫు నుంచి కేసులు పడడంతో హైకోర్టులో ఈ వ్యవహారంపై వాదనలు ఆసక్తికరంగా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English