కవిత బర్త్ డే రోజు అతిథులకు సర్ ప్రైజ్

కవిత బర్త్ డే రోజు అతిథులకు సర్ ప్రైజ్

తెలుగుప్రాంతాల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎవరైనా ఇళ్లల్లో పెళ్లి జరుగుతుంటే.. పెళ్లికూతురు వారింట్లో గాజులు వేయిస్తూ ఉంటారు. పెళ్లికొడుకు వారు.. ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చును భరించే సంప్రదాయం ఒకటి ఉంది. దీని ప్రకారం.. పెళ్లి కూతురింట్లో గాజులు వేసే అతన్ని పిలిపించి.. బంధువుల్ని.. స్నేహితుల్ని.. ఇరుగుపొరుగు.. తెలిసిన వారిని పిలిచి వారికి అవసరమైన గాజులు వేయించటం కనిపిస్తుంది.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత ఇంచుమించు ఇలాంటి పనే చేశారు. కాకుంటే.. ఆమె పుట్టినరోజు సందర్భంగా. తన బర్త్ డే ను పురస్కరించుకొని కొత్త సందడిని సృష్టించారు ఎంపీ కవిత. ఢిల్లీలో తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. గాజులబ్బాయిని పిలిపించి.. తన బర్త్ డే కు వచ్చిన మహిళలందరికి గాజులు వేయించారు.

ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లాడ్ బజార్ నుంచి గాజుల తయారీదారుల్ని పిలిపించి మరీ.. వేడుకను ఘనంగా నిర్వహించటం గమనార్హం. పుట్టినరోజు వేడుకకు వచ్చిన మహిళలందరికి వారికి నచ్చినన్ని గాజుల్ని వేయించిన తీరు ఢిల్లీలోని వారికి సరికొత్తగా అనిపించిందట. ఏమైనా.. భిన్నంగా వ్యవహరించి.. అందరిని కవితక్క సర్ ప్రైజ్ చేశారని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు