మతిమరుపుతో ఇబ్బంది పడుతున్న సోనియా

మతిమరుపుతో ఇబ్బంది పడుతున్న సోనియా

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటే ఎవరికైనా ఠక్కున ఆమె రూపం స్ఫురణకు వస్తుంది... వేగవంతమైన నడక, తడబడకుండా బిగ్గరగా సూటిగా స్పష్టంగా మాట్లాడే ఆమె పద్ధతి గుర్తుకొస్తుంది.. కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ సోనియాలో మునుపటి వేగం తగ్గుతుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. తాజాగా పార్లమెంటులో ఏపీ విషయంలో పోరాటానికి రెడీ అయిన ఆమె పలు సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు తడబడడం... పొరపాటు పడడం... తనకు తెలియకుండా తప్పులు మాట్లాడడం వంటివి జరిగాయి. దీంతో సోనియాలో వార్ధక్య లక్షణాలు కనిపిస్తున్నాయని... ఆమెకు మతిమరుపు ఎక్కువవుతోందని కాంగ్రెస్ జాతీయ నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చడంలేదని బుధవారం ఏపీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి మొరపెట్టుకొన్నారు. ఆ తరువాత  సోనియాగాంధీ ప్రసంగిస్తూ.. ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిప సంగతీ తెలిసిందే. అయితే... ఆ సందర్భంగా ఆమె రెండేండ్లుగా అధికారంలోనున్న యూపీఏ ప్రభుత్వం ఏమి చేస్తున్నదంటూ నోరు జారారు. దీంతో అక్కడున్న ప్రజాప్రతినిధులు విస్తుపోయారు. అధికారంలోనున్నది ఎన్డీయే కదా..? అధికారపక్షాన్ని విమర్శించబోయి మేడమ్ సొంత కూటమిపైనే దుమ్మెత్తిపోస్తున్నారేమిటని ఆశ్చర్యపోవడం కాంగ్రెస్ నేతల వంతైంది. పలుమార్లు ఆమె ఎన్డీయే అనడానికి బదులుగా యూపీఏ ప్రభుత్వం అంటూ ప్రస్తావించారు. అంతేకాకుండా గతంలో అనర్గళంగా మాట్లాడే సోనియా ఇటీవల కాలంలో మాటల కోసం కూడా తడుముకుంటన్నారని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు