భారత్ మాతాకీ జై అని అసద్ అనడట!

భారత్ మాతాకీ జై అని అసద్ అనడట!

భారత్ మాతాకీ జై.. ఈ మాటేమీ అన్పార్లమెంటరీ పదమేమీ కాదు. ఈ మాటను ఏ కోణంలో చూసినా.. అశ్లీలం కానీ అసభ్యత గోచరించే శబ్దం కానీ అస్సలు వినిపించదు. అలాంటప్పుడు ఆ మాటను అనటానికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అస్సలు ఒప్పుకోరట. తన గొంతు మీద కత్తి పెట్టినా కూడా ఆ నినాదాన్ని తాను చేయనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్ లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన అసదుద్దీన్ ఓవైసీ.. యువతరానికి భారత్ మాతాకీ జై అన్న నినాదాన్ని బోధించాలంటూ ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యానించటం తెలిసిందే. యువతలో దేశభక్తిని పెంచేలా ప్రతి స్కూలులోను భారత్ మాతాకీ జై అన్న మాటను అలవాటు చేయాలని కోరారు. దీన్ని తప్పు పట్టిన అసద్.. భారత్ మాతాకీ జై అనాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని.. తన గొంతుపై కత్తి పెట్టినా ఆ నినాదాన్ని చేయనని వ్యాఖ్యానించటం వివాదాస్పదంగా మారింది.

పుట్టి పెరిగి.. బతుకుతున్న దేశాన్ని జై కొట్టటానికి అసద్ కు ఎందుకంత ఇబ్బందో అర్థం కాదు. ప్రాణం పోయినా తాను ఆ మాట అననని చెప్పటం.. ఆయన మాటకు ఆక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొట్టిన తీరును చూస్తే షాక్ తగలక మానదు. మరి.. అసద్ నోటి నుంచి ఇలాంటి మాటలకు లౌకిక వాదులు.. ప్రజాస్వామ్యవాదులు.. జేఎన్యూ విద్యార్థులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.