చంద్రబాబు సాక్షిపై కన్నేశారా?

చంద్రబాబు సాక్షిపై కన్నేశారా?

అక్రమాస్తుల కేసులో జగన్ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉండగా ఈడీ అటాచ్ చేసుకున్న ఆయన ఆస్తులను ప్రభుత్వం తరఫున స్వాధీనం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాక్షి పత్రికను, జననీ ఇన్ ఫ్రా, ఇతర సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఏపీ స్పెషల్ కోర్టుల చట్టం 2015 ను ప్రయోగించి ఈ వ్యవహారాన్ని చట్టబద్ధంగా పూర్తిచేసేందుకు చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన పంపి కేంద్ర హోం, న్యాయ శాఖల వద్ద ఆమోద ముద్ర వేయించుకున్నారని తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడడమే తరువాయి.

ఈ చట్టం అమల్లోకి తెచ్చి కేసు విచారణను నిర్ణీత గడువులోగా ముగించేలా చేసి అనంతరం ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునే వీలుంటుంది. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ విషయం ఇప్పటికే వెల్లడించారు. అయితే... ఇప్పటికే దీనిపై అలర్ట్ గా ఉన్న జగన్ ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు గాను ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ నాథ్, రాష్ట్రపతి ప్రణబ్ లను కలిసి చర్చించారని తెలుస్తోంది. జగన్ భాగస్వామిగా ఉన్న కంపెనీల్లో రూ.2 వేల కోట్ల విలువైన సంస్థలు ఈడీ అటాచ్ మెంట్లో ఉన్నాయి. అందులో సాక్షి కూడా ఒకటి. జగన్ అంటే కొంత సానుకూలంగా ఉండే రాష్ట్రపతి ప్రణబ్ ఆయన్ను కాపాడుతారో లేదంటే చంద్రబాబు, కేంద్రం ఒత్తిళ్ల ముందు నిలవలేక నిస్సహాయంగాఉండిపోతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు