విజయ్ మాల్యా దొరికేశాడు

విజయ్ మాల్యా దొరికేశాడు

విజయ్ మాల్యా ఎక్కడ.. ఎక్కడ.. ఓ బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు  జనాలు. ఐతే అల్లరి నరేష్ మాత్రం ఇదిగోండి నా సెల్ఫీలో ఉన్నాడు అంటూ షాక్ ఇచ్చాడు అందరికీ. బహుశా ఈ సెల్ఫీ దిగింది ఇప్పుడు కాకపోవచ్చు.. లేదా ఆ సెల్ఫీ అంతా సెటప్ కావచ్చు. ఏదైనా కానివ్వండి.. తన భుజంపై చేయి వేసి మాల్యా కులాసాగా నవ్వుతుంటే అల్లరోడు క్లిక్‌మనిపించి ఉన్నట్లుగా ఉన్న సెల్ఫీ.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయిపోయింది.

‘‘విజయ్ మాల్యా బ్యాంకులకు చిక్కక పోయి ఉండొచ్చు. కానీ నా సెల్ఫీకి చిక్కాడు. ఇండియాలో ఉండగా మాల్యా దిగిన చివరి సెల్ఫీ చూసి ఎంజాయ్ చేయండి’’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా జోడించాడు అల్లరి నరేష్. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లరి నరేష్.. త్వరలో ‘సెల్ఫీ రాజా’ అనే సినిమా మొదలుపెట్టబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత, హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఐతే నరేష్ మాత్రం ఇప్పటికే తన సినిమా ప్రమోషన్ మొదలుపెట్టేశాడు. ‘సెల్ఫీ రాజా’ అనే టైటిల్‌కు మంచి ప్రచారం తెచ్చిపెట్టే సెల్ఫీతో ట్విట్టర్‌ను షేక్ చేశాడు. పోనీలెండి.. బ్యాంకుల్ని ముంచిన మాల్యా అల్లరోడికైనా ఇలా ఉపయోగపడుతున్నా సంతోషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు