ముద్రగడ దీక్ష ఎందుకు వాయిదా వేశాడంటే...

ముద్రగడ దీక్ష ఎందుకు వాయిదా వేశాడంటే...

కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ముద్రగడ మరోసారి దీక్ష చేయడానికి రెడీ అయ్యాడు. మొన్న ముద్రగడ చేసిన దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్రం పక్కన బెట్టేసిందని... దాంతో తన జాతికి అన్యాయం జరుగుతోందని ముద్రగడ గత రెండు మూడు రోజులగా దీక్ష చేస్తున్నానంటూ మీడియా ముందు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ నాయకులు కూడా ముద్రగడపై ఎదురుదాడికి దిగింది. కాపుల సంక్షేమం కోసం రూ.1000 కోట్లు కేటాయించామని... రిజర్వేషన్ల కోసం కమిషన్ వేశామని... వాటి ఫలితాలు రాక ముందే.. ముద్రగడ దీక్ష చేస్తాననడం హాస్యాస్పదమని అతని సామాజిక వర్గానికే చెందిన మంత్రి గంటాశ్రీనివాసరావు, ఎంపీ తోట నర్సింహం విమర్శలు గుప్పించారు. జగన్ ఇచ్చిన ప్యాకేజీలకు అమ్ముడుపోయి.. చిత్త శుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ముద్రగడ ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.

దాంతో ముద్రగడ దీక్ష చేయడానికి ఇది సమయం కాదు అనుకున్నాడో ఏమో... విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి.. తన దీక్షను వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. విద్యార్థుల పరీక్షలు అయిపోగానే దీక్షను ప్రారంభించి... కాపులకు న్యాయం చేస్తా అంటున్నాడు ముద్రగడ. మరి మొన్ననే రుణాలు కూడా అందుకున్న పేద కాపు సోదరుల నుంచి దీక్షకు ఏమాత్రం మద్ధతు లభిస్తుందో తెలియదు కానీ... మరో వెయ్యి కోట్లతో నిధిని ఏర్పాటుచేసి... మరోసారి రుణాల పంపిణీకి అధికార పార్టీ సిద్ధం అవుతోంద. దాదాపు మూడు లక్షలకు పైగా పెండింగ్ లో వున్న రుణ దరఖాస్తులను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే.. ముద్రగడ ఎత్తగడ కొంత బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు. చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి.. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు తగలబెట్టడం ఎపిసోడ్లో వున్నాడని... ఆ సంఘటన జరగక ముందు పది రోజుల నుంచి ముద్రగడతో టచ్ లో వున్నాడని, కాకినాడ, కిర్లంపూడి ప్రాంతాల్లో సంచరించాడని అదికారపార్టీ ఆధారాలను సేకరించే పనిలో వుంది. మరి భూమన కరుణాకర్ రెడ్డితో ముద్రగడ బంధం ఎలాంటిదనేది అధికారపార్టీ బయటపెడితే మాత్రం ముద్రగడ కూడా జైలుకు వెళ్లాల్సిందే. చూద్దాం ఏమి జరుగుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు