వాతపెట్టి వెన్నరాస్తున్న కిరణ్‌

వాతపెట్టి వెన్నరాస్తున్న కిరణ్‌

విద్యుత్‌ ఛార్జీలు పెంచాలనుకుని దాన్నుంచి కొంత వెనక్కి తగ్గారుగాని పూర్తిగా విద్యుత్‌ ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోలేదు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. అదలా ఉంచితే, సర్‌ఛార్జీల పేరుతో విద్యుత్‌ వినియోగదారులను వీలైనంత గట్టిగా బాదేస్తున్నది కిరణ్‌ ప్రభుత్వం. సర్‌ఛార్జి మీద సర్‌ఛార్జి వేస్తూ జనానికి వాత పెడుతూ, ఎన్నికల్లో గెలవడానికి పలు పలు విధాలుగా కొత్త పథకాలను ప్రారంభిస్తూ వాటిద్వారా కాలిన గాయాలకు వెన్న రాసే ప్రయత్నం చేయడం కిరణ్‌కే చెల్లింది. 

'బంగారు తల్లి' పేరుతో ఆడపిల్లలకు నగదు ప్రోత్సాహకమిచ్చే పథకాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు ప్రకటించారు. వంద రూపాయలు చూపించి, వెయ్యి రూపాయలు వెనక నుంచి లాగడమే ప్రభుత్వ పథకాల్లోని మర్మం. రెండ్రూపాయలకే కిలో బియ్యం పేదలకి. అదే పేదలో నాణ్యమైన బియ్యం కొనాలంటే 40 రూపాయలు వెచ్చించాలి. అక్కడ తగ్గించినట్లుగా చూపి, ఇంకో చోట వాయించేయడం ప్రభుత్వాలకి బాగా తెలుసు. ఇవి ప్రజలకూ కొంచెం అర్థమవుతాయిగాని, వారిని ఇలాంటి పథకాలే ఎక్కువగా ఆకర్షిస్తాయి, కాని దొడ్డిదారిన జరిగే దోపిడీ కనిపించదు. రాజకీయ నాయకులకూ అదే కావాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English