14 మంది అయినోళ్లను చంపినోడి కారణం తెలిసింది ​

14 మంది అయినోళ్లను చంపినోడి కారణం తెలిసింది ​

తండ్రి.. తల్లి.. తోడబుట్టిన వారితో పాటు.. పెళ్లాం.. పిల్లలు.. ఇలా కుటుంబ సభ్యులందరిని కత్తితో గొంతులు కోసేసి 14 మంది మరణానికి కారణమై.. తనకు తాను ఆత్మహత్య చేసుకున్న హస్నైన్ పరేకర్ దుర్మార్గం దేశం మొత్తాన్ని కదిలించి వేసిన సంగతి తెలిసిందే. ఇంత దారుణానికి అతను ఎందుకు ఒడిగట్టాడన్న విషయం ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ సస్పెన్స్ ను వీడేందుకు.. ఆ కిరాతకుడి సోదరి ఒకరు ప్రాణాలతో బయటపడటం తెలిసిందే.

తాజాగా ఆమె.. తన సోదరుడు హస్సైన్ కు సంబంధించి షాకింగ్ విషయాల్ని చెబుతోంది. తన సోదరుడు విచిత్రమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. అతగాడు మానసిక రుగ్మతలతో పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నట్లు చెబుతున్నాడు. ఇతగాడి అతి ఏ రేంజ్లో ఉంటుందంటే.. తోడబుట్టిన సోదరి.. మానసిక వికలాంగురాలైన బతుల్ పై పలుమార్లు లైంగికంగా వేధించినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. పెళ్లి కాని ఆ చెల్లెలుపై తరచూ లైంగికంగా వేధించేవాడని.. ఆమె ఆ విషయాన్ని తల్లి.. ఇతర సోదరీమణులతో చెప్పిందని.. ఇది గ్రహించిన హస్సైన్ తన దుర్మార్గాన్ని దాచి పెట్టేందుకు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి ఉండి ఉంటాడని చెబుతోంది.

రెండేళ్లుగా ఉద్యోగం లేని అతగాడు.. షేర్ వ్యాపారం చేసి భారీగా నష్టపోయినట్లు ఆ కిరాతకుడి సోదరి వెల్లడించింది. తెలిసిన వారు.. బంధువుల దగ్గర నుంచి దాదాపుగా రూ.67 లక్షల వరకూ అప్పులు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. షేర్ వ్యాపారంలో తీవ్రంగా నష్టపోవటం.. మానసిక సమస్యల నేపథ్యంలో.. సైకోలా మారి ఇంతటి దారుణానికి పాల్పడి ఉంటారన్న సందేహాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే.. మరిన్ని అంశాల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు