'బాబు మోసం చేశాడు.. రోడ్డెక్కుతున్నా'

'బాబు మోసం చేశాడు.. రోడ్డెక్కుతున్నా'

బీసీల్లో కాపుల్ని చేర్చాలంటూ ఉద్యమాన్ని చేపట్టి.. ఏపీ సర్కారుకు వణుకు పుట్టించిన మాజీ మంత్రి.. కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి గళం విప్పారు. ఏపీ సర్కారు ఇచ్చిన హామీతో తన దీక్షను విరమించిన ముద్రగడ.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాను దీక్షను విరమించి తప్పు చేశానని.. అలా చేసినందుకు సిగ్గు పడుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం.

బాబు హామీలు నమ్మి తాను దీక్ష విరమించానని.. హామీలు అమలుకు నోచుకోవటం లేదని.. తాను తిరిగి రోడ్డు ఎక్కటానికి సిద్ధంగా ఉన్నట్లుగా వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు మోసపూరితమంటూ తనకు ఫోన్లు వస్తున్నట్లుగా ముద్రగడ వెల్లడించారు.

చంద్రబాబును నమ్మటం పొరపాటు అయ్యిందని.. రెండు రోజుల్లో జిల్లాలు పర్యటించి.. ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేస్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు. ముద్రగడ స్వరంలోని మార్పు మీద చంద్రబాబు సత్వరమే రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English