ఏపీ ప్రభుత్వం జగన్ నిర్దోషి అంటోందా?

ఏపీ ప్రభుత్వం జగన్ నిర్దోషి అంటోందా?

నేరుగా జగన్ నిర్దోషి అనలేదు కానీ.. పరోక్షంగా ఉద్దేశం మాత్రం అలాగే అనిపిస్తోంది. విపక్ష నేత జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇండియా సిమెంట్స్ కంపెనీకి కడప జిల్లాలో నీళ్లు కేటాయించడంలో అక్రమాలు జరిగాయని.. అందువల్లే ఆ సంస్థ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీనియర్ ఐఎఎస్ అదికారులు ఆదిత్యనాథ్ దాస్, శ్యామ్యూల్ లపై విచారణకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా.. కేంద్రం అందుకు అనుమతించలేదు. అధికారుల తప్పు లేదని.. అసలు నీటి కేటాయింపులో తప్పే జరగలేదని కేంద్ర పేర్కొనడం విశేషం. ఏపీ ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ తోనే కేంద్రం ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక నీటి కేటాయింపుల విషయంలో ఏపీ సర్కారు నేరుగా అధికారుల్ని వెనకేసుకుని వచ్చింది. విధానపరమైన చిన్న తప్పు మాత్రమే జరిగిందని.. ఆదిత్యనాథ్ దాస్, శామ్యూల్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా చేసినట్లు భావించలేమని.. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించడం విశేషం. ఐతే ఏపీ ప్రభుత్వం ఈ ఐఏఎస్ అధికారుల్ని వెనకేసుకుని వచ్చిందంటే.. పరోక్షంగా జగన్ విషయంలో కూడా సానుకూలంగా వ్యవహరించినట్లే అని అర్థం చేసుకోవచ్చు. నీటి కేటాయింపుల విషయంలో దురుద్దేశాలు లేవు అన్నారంటే.. ఇండియా సిమెంట్స్ తప్పేమీ లేదని.. జగన్ కు ఆ సంస్థ ఏ ప్రయోజనాలూ చేకూర్చలేదని అంగీకరిస్తున్నట్లే అన్నమాట. మొత్తానికి ఏపీ సర్కారు జగన్ అక్రమాస్తుల కేసులో ఒక భాగం వరకు క్లీన్ చిట్ ఇచ్చేనట్లే అనుకోవాలి.

Read More:

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు