దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది

దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది

ఇదేదో సినిమా డైలాగ్ కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సోనియాగాంధీ దూకుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పుడో..మరెప్పుడో అంటూ లెక్కలేసుకుంటూ.. భవిష్యత్తు అంతా ఆశాజనకమే అనుకునే కాంగ్రెస్ నేతలకే కాదు.. టీఆర్ఎస్ అధినాయకత్వానికి సోనియా షాక్ ఇచ్చింది.2014 ఎన్నికల్లో అత్యధిక సీట్లు సంపాదించి.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించి... ఆపై సంకీర్ణ ప్రభుత్వంలో తాము అనుకున్నది సాధించాలని చాలా చాలా ప్లాన్లు వేసుకున్న కేసీఆర్ కు సోనియాగాంధీ రాకెట్ స్పీడ్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.

చాలామంది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తాము చూస్తుంది నిజమేనా అన్న సందేహం పట్టి పీడిస్తుంది. వారి పరిస్థితే అలా ఉంటే.. టీఆర్ఎస్ నేతలకు అసలు విషయమే అర్థం కావటం లేదు. ఇది కలా.. నిజమా అన్న ఆనందంతో ఉబ్బి తబుబ్బిపోతున్నారు. తమ ఊహల్లో ఉంటే విషయం.. ఇప్పుడు రియల్టీలోకి రావటం వారు  జీర్ణించుకోలేకపోతున్నారు.కాంగ్రెస్ ప్రదర్శించిన దూకుడు కేసీఆర్ ను సైతం.. అయోమయానికి గురి చేసిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎఫ్పుడో.. 2014 చివర్లోనో.. 2015 మధ్యభాగానో జరుగుతుందని ఊహించిన సినిమా.. ఏమాత్రం అంచనాలు లేకుండా 2013 మధ్యకే సాకారం కావటం తెలంగాణ నాయకులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.

అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యమైనదని..అదంత తేలికైన విషయం కాదని అంచనాలు వేసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరించే సీమాంధ్ర నాయకులకు సోనియా నిర్ణయం దిమ్మ తిరిగిపోయిందని చెబుతున్నారు. తమను సంప్రదించకుండా.. తమతో కనీసం మాట కూడా మాట్లాడకుండా అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారన్న ధీమాతో ఉన్నసీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు తాజా నిర్ణయం ఓ పెద్ద షాక్ కు గురి చేసింది. చివరికి సోనియాగాంధీని కలిసిన ఎంపీల బృందం సైతం.. రాష్ట్ర విభజన నిర్ణయం తమతో మాట్లాకుండా ఎలా తీసుకుంటారని ప్రశ్నించినప్పుడు.. గతంలో మాట్లాడాం కదా అన్న సోనియాగాంధీ  ప్రశ్నకు బదులివ్వలేని స్థితిలో పడిపోయారు. మొత్తానికి ఒక నిర్ణయం మూడు ప్రాంతాల నాయకులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English