పార్టీ మారితే అన్నీ మారతాయ్‌

పార్టీ మారితే అన్నీ మారతాయ్‌

ఏ ఎండకా గొడుగు.. అని పెద్దలు ఉత్తుత్తినే అన్లేదు సుమీ. పార్టీలు మారే రాజకీయ నాయకుల గురించే ఇది పుట్టి ఉండొచ్చును. సమాజం మార్పుకోరుకుంటోందని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అందలం ఎక్కించాలన్నది ప్రజల అభిప్రాయంగా కనిపిస్తోందని వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ లో చేరిన మాజీ మంత్రి దాడి వీర భద్రరావు అన్నారు.

ఎన్టీఆర్‌ తర్వాత అంతటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని ఆయన చెప్పారు. వై.ఎస్‌. జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తమ ఏకసూత్ర కార్యక్రమం అని ఆయన చెబుతున్నారు. అవినీతి ఆరోపణలు లేని పార్టీ ఏముందని ఆయన ప్రశ్నించారు.

ఎంతలో ఎంత మార్పు? టిడిపి లక్ష కోట్ల అవినీతి ఆని ఆరోపిస్తే అందులో ఉన్నప్పుడు ఇదే దాడి వీరభద్రరావుగారు 16 లక్షల కోట్ల అవినీతి అన్నారు. చేసిన అవినీతికి, ప్రజల్ని మోసం చేసినదానికి శిక్షగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అర్థాంతరంగా దేవుడు పట్టుకుపోయాడని అన్నదీ ఈయనే. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భజన చేయక తప్పదుగాని ఇంత దారుణంగా ఊసరవెల్లిలా వ్యవహరిస్తే ఎలా మేస్టారూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు