జగన్‌ ఆస్తులు ఏపీ సర్కారు స్వాధీనంలోకి..?

జగన్‌ ఆస్తులు ఏపీ సర్కారు స్వాధీనంలోకి..?

మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర కలకలం రేపటంతోపాటు.. సంచలనం సృష్టిస్తోంది. నేరుగా బాబు నోటి నుంచి ఈ వ్యాఖ్యలు సూటిగా కాకుండా.. పరోక్షంగా ఉండటం గమనారం. ఏపీ విపక్ష నేత జగన్‌ మీద చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు తావిచ్చేలా ఉన్నాయి.

అవినీతి పరుల ఆస్తుల విషయంలో బాబు సర్కారు తీరుపై అడిగిన ప్రశ్నలకు బాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అవినీతిపరుల ఆస్తులను త్వరలో స్వాధీనం చేసుకుంటాం. జప్తులో ఉన్న అవినీతి పత్రికనూ స్వాధీనం చేసుకుంటాం. అది ప్రభుత్వ ఆస్తి.. ప్రజలకు చెందుతుంది'' అంటూ వ్యాఖ్యలు చేయటం సంచలంగా మారింది. జగన్‌ పేరును నేరుగా ప్రస్తావించకున్నా.. అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన పత్రికగా సాక్షిని ఆయన పలుమార్లు ప్రస్తావించటం తెలిసిందే.

ఇప్పటివరకూ జగన్‌ ఆక్రమాస్తుల విషయంలో బాబు పలు వ్యాఖ్యలు చేసినా.. తాజాగా చేసిన కామెంట్లు మాత్రం చాలా తీవ్రమైనవిగా చెబుతున్నారు. అవినీతిపరుల ఆస్తులు తీసుకుంటామని.. అదంతా తన కోసం కాదని.. ప్రజల కోసమని చెప్పిన బాబు మాటల తీరు చూస్తే.. జగన్‌ కు చెందిన సాక్షిపత్రిక విషయంలో ఏపీ సర్కారు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? అన్న సందేహం కలిగేలా ఉండటం గమనారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు