జగన్‌ ఆడేది గేమ్‌ కాదా ''బుడ్డా''..?

జగన్‌ ఆడేది గేమ్‌ కాదా ''బుడ్డా''..?

నిన్నమొన్నటి వరకూ మీడియాతో పెద్గగా మాట్లాడని ఎమ్మెల్యేలు సైతం తెర మీదకు వస్తున్నారు. తాము ప్రాతినిధ్యం వహించే జిల్లా ప్రజలకు తప్పించి.. బయట జిల్లాలకు పెద్దగా తెలీని ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వస్తున్నారు. అందుకు నిదర్శనంగా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.

డిస్ట్రిక్‌ ఫిగర్‌ అయిన బుడ్డా స్టేట్‌ ప్రజలకు పెద్దగా సుపరిచితుడు కాదు. అలాంటి ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చేశారు.  తమ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. అదంతా అబద్ధమని.. మీడియా ప్రచారం మాత్రమేనని.. పార్టీని విడిచి ఎవరూ వెళ్లటం లేదని తేల్చి చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని.. తమ పార్టీ నేతలు ఎవరూ వెళ్లనప్పటికీ.. వెళుతున్నారంటూ మీడియాతో అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఇదేమీ మంచి పద్ధతి కాదంటూ విమర్శిస్తున్నారు.

బుడ్డా మాటలే నిజమని కాసేపు అనుకుంటే.. మరి ఎలాంటి ఆధారం చూపించకుండా మొన్నా మధ్య విపక్ష నేత వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేలు టచ్‌ లో ఉన్నారని.. తాను పేర్లు బయటపెట్టిన గంట వ్యవధిలో చంద్రబాబు సర్కారు కూలిపోతుందని చెప్పటం ఏమిటి? అలాంటి మాటల్ని ఏమనాలి? ఎక్కడైనా స్పష్టమైన మెజార్టీతో.. బలమైన అధినేత అధికారంలో ఉంటే.. ఆ పార్టీని తాను కూల్చేస్తానని.. జగన్‌ ఎలా చెబుతారు? తమ అధినేత ఇచ్చిన స్క్రిప్ట్‌ ను అప్పజెప్పాల్సిన వచ్చినప్పుడు బుడ్డా లాంటి వాళ్లు 'మైండ్‌ గేమ్‌' మాటలకు మించి ఇంకేం చెప్పగలరు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు