చంద్రబాబు జోరు.. జగన్‌ కంగారు

చంద్రబాబు జోరు.. జగన్‌ కంగారు

వైసీపీ అధినేత జగన్‌ అనుకోని మలుపుతో అభాసుపాలయ్యారు. తాను తలచుకుంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా కోతలు కోసిన జగన్‌ కు ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చెమటలు పట్టిస్తున్నారు. తమతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌ లో ఉన్నారని జగన్‌ చెబుతున్న సమయంలో రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీన్ని భూమా ఇంతవరకు ఖండించకపోవడంతో ఆయన చేరిపోతారని జగన్‌ కూడా ఫిక్సయిపోయారని సమాచారం. అందుకే వెంటనే రాయబారానికి భూమా ఇంటికి పార్టీ నేతలను పంపించారు. అంతేకాదు.... హైదరాబాద్‌ లో అందుబాటులో ఉన్న నేతలతో ఇప్పటికిప్పుడు సమావేశం కూడా పెట్టారు.

జగన్‌ కొద్దిసేపటి కిందట అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో లోటస్‌ పాండ్‌ లో భేటీ అయ్యారు. భూమా నాగిరెడ్డి పార్టీ వీడుతున్నట్లుగా వస్తున్న వార్తలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కుమార్తె, మరో ఇద్దరు ఎమ్మెల్యేలూ తెలుగుదేశం గూటికి చేరనున్నట్లుగా వస్తున్న వార్తలు వైకాపాలో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో జగన్‌ ఆదేశం మేరకు వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు భూమాతో మాట్లాడి పార్టీ వీడే యోచన విరమించుకోవాలని కోరనున్నారు.

మొత్తానికి పిట్టల దొరలా పెద్దపెద్ద మాటలు చెప్పిన జగన్‌ సొంత పార్టీ నేతలే పరువు తీస్తున్నారు. భూమా టీడీపీలో చేరుతారా లేదా అన్నది పక్కనపెడితే జగన్‌ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిని చూసి రాజకీయ నాయకులంతా జాలిపడుతున్నారు. రాజకీయాల్లో స్థాయికి మించిన వ్యాఖ్యలు చేయకూడదని... అందులోనూ టైం బాగులేనప్పుడు అస్సలు ఎక్స్‌ ట్రాలు చేయరాదని... జగన్‌ తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్న జగన్‌ చంద్రబాబు గవర్నమెంటును ఏం కూలుస్తారని సీనియర్లు అంటున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు