శోభనాన్ని అడ్డుకున్న ఏపీ పోలీసులు

శోభనాన్ని అడ్డుకున్న ఏపీ పోలీసులు

శోభనం లాంటి వ్యక్తిగత విషయాల్లోకి పోలీసులు దూరటమా? అంటూ ఆగ్రహం చెందితే తప్పులో కాలేసినట్లే. ఏపీ పోలీసుల పుణ్యమా అని.. ఒక మహిళ జీవితం అన్యాయం కాకుండా ఆగింది. ఏలూరులోని పెనుగొండ మండలం నాగళ్లదిబ్బకు చెందిన సోమరాజు అనే దుర్మార్గుడి దుర్మార్గాన్ని పోలీసులు అడ్డుకోవటం అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఇందుకు కారణమైన పోలీసుల్ని వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

హెచ్‌ఐవీతో బాధపడుతున్న సోమరాజు.. తనకున్న జబ్బును దాచి పెట్టి.. ఒక అమాయకురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఇతగాడి దుర్మార్గం గురించిన సమాచారం మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులకు తెలిసి.. పెనుగొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్పందంచిన పోలీసులు.. హుటాహుటిన వధువు ఇంటికి వెళ్లారు. అదే సమయంలో కొత్తగా పెళ్లయిన జంటకు శోభనం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. వరుడి దుర్మార్గం గురించి వధువు తరఫు వారికి చెప్పటంతో వారు శోభనాన్ని క్యాన్సిల్‌ చేశారు. వధువు జీవితాన్ని కాపాడిన పోలీసులకు ఆమె తరఫు వారు అభినందిస్తున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు