ఆ సినిమా సూపర్‌ అంటున్న సీఎం

ఆ సినిమా సూపర్‌ అంటున్న సీఎం

రాజకీయ నాయకులు సినిమాలు చూడ్డం చాలా తక్కువ. అందులోనూ సీఎం, పీఎం లాంటి పదవుల్లో ఉన్నవాళ్లు సినిమాలు చూస్తే అది పెద్ద వార్త అయిపోతుంది. వాళ్ల జీవితంలో ప్రతి నిమిషం చాలా విలువైంది కాబట్టి.. రెండున్నర గంటలు థియేటర్లో కూర్చుని సినిమా చూడ్డమంటే చాలా కష్టం. ఐతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన బిజీ షెడ్యూల్‌ ను పక్కనబెట్టి.. లేటెస్టుగా ఓ సినిమా చూశాడు. ఆ చిత్రమే.. నీరజ. సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో రామ్‌ మద్వాని రూపొందించిన ఈ  చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని ఒక రోజు ముందే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా చూడటం విశేషం.

'నీరజ' చిత్రాన్ని చూడటమే కాదు.. దానిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్‌ కూడా చేశారు కేజ్రీవాల్‌. ఇటీవల కాలంలోతాను చూసిన మంచి సినిమాల్లో 'నీరజ' ఒకటని.. ఈసినిమా స్ఫూర్తినిచ్చేలా ఉందని కేజ్రీవాల్‌ అన్నారు. పరుల హితం కోసం బతకాలి, అవసరమైతే ప్రాణాలుఫణంగా పెట్టాలి అన్న సందేశం ఈ సినిమాలో ఉందనితెలిపారు. డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, తమపార్టీ నేతలతో కలిసి 'నీరజ' చిత్రాన్ని చూశారు కేజ్రీవాల్‌. 1986లో హైజాక్‌ అయిన ముంబై-న్యూయార్క్‌ విమానంలో ఉగ్రవాదుల నుంచిప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన ఎయిర్‌ హోస్టెస్‌ నీరజా బానోత్‌ జీవిత కథఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై అమీర్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ లాంటి బాలీవుడ్‌ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు