జేఎన్‌ యూ వెనుక అంత పెద్ద కుట్ర ఉందా?

జేఎన్‌ యూ వెనుక అంత పెద్ద కుట్ర ఉందా?

దేశ వ్యాప్తంగా కలకలం రేపటంతో పాటు.. వర్సిటీల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలకు కారణమైన జేఎన్‌ యూ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర ఉందన్న మాట వినిపిస్తోంది. ఢిల్లీలోని జేఎన్‌ యూ వర్సటీలో  పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష విధించిన అఫ్జల్‌ గురు సంస్మరణ సభను నిర్వహించటం.. దాన్ని ఏబీవీపీ అడ్డుకోవటం.. ఈసందర్భంగా భారత్‌ వ్యతిరేక.. పాక్‌ అనుకూల నినాదాలు చేయటం పెద్ద కలకలాన్నే రేపింది.

ఈ ఉదంతానికి సంబంధించి విద్యార్థి నేత కనయ్య కుమార్‌ పై దేశద్రోహం కేసు నమోదుతో పాటు.. అతన్ని అరెస్ట్‌ చేసి.. తీహార్‌ జైలుకు తరలించారు.ఈ ఉదంతంలో భారత్‌ వ్యతిరేక నినాదాలు చేసింది కనయ్య కాదని.. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉమర్‌ ఖలీద్‌ అనే వ్యక్తి ఉన్నట్లు పోలీసులు కన్ఫర్మ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఇతగాడు ఎవరన్న అంశంపై దృష్టి సారిస్తే.. సిమీ మాజీ చీఫ్‌ కొడుకే ఉమర్‌ ఖలీద్‌ గా ఒక ప్రముఖ ఛానల్‌ కు చెందిన మీడియా ప్రతినిధి తన ట్విట్టర్‌ అకౌంట్లో ప్రకటించటంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌ తిని.. ఈ ఉదంతంపై విచారణ షురూ చేశారు. ఒకవేళ సదరు మీడియా ప్రతినిధి పేర్కొన్నది నిజమైన పక్షంలో.. జేఎన్‌ యూ వ్యవహారంలో ఒక పెద్ద కుట్ర ఉన్నట్లే భావించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు