ఎన్నికల బరిలో అగ్ర హీరోయిన్‌

ఎన్నికల బరిలో అగ్ర హీరోయిన్‌

తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు ఆయా పార్టీల అగ్రనేతలు పొత్తులపై దృష్టిసారిస్తూ బిజీబిజీగా ఉండగా నాయకులు తమ భవిష్యత్‌కు బంగారుబాట వేసే నియోజకవర్గాల వెతుకులాటలో పడ్తున్నారు. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకేతో జట్టుకట్టి ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ నటి నగ్మా తన పొలిటికల్‌ పోల్‌పై క్లారిటీ ఇచ్చారు.

అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నగ్మా ఇప్పటికే వివిధ సందర్భాల్లో తమిళనాడులో పర్యటించారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు నగ్మా ప్రకటించారు. పుదుచ్చేరి పర్యటనలో ఉన్న నగ్మా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారా అని విలేకరుల ప్రశ్నించగా...కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుమతిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు