సచిన్‌ రిటైరైనా రికార్డులే

సచిన్‌ రిటైరైనా రికార్డులే

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆటకు వీడ్కోలు పలికి రిటైర్మెంటు తీసుకున్నా కూడా ఇంకా రికార్డులు సృష్టిస్తున్నాడు. అయితే ఈసారి ఆయన రికార్డులు క్రికెట్‌ లో కాదు...పుస్తకాలతో ఆయన రికార్డులు సృష్టించాడు. సచిన్‌ ఆత్మకథ 'ప్లేయింగ్‌ ఇట్‌ మై వే' లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో నమోదవడంతో సచిన్‌ పేరు మళ్లీ మార్మోగుతోంది.

క్రికెట్‌ లో దాదాపు అన్ని రికార్డులనూ బ్రేక్‌ చేసిన క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ ఆ రికార్డుల ఒరవడిని కొనసాగిస్తున్నాడు. సచిన్‌ టెండూల్కర్‌ ఆత్మకథ బెస్ట్‌ సెల్లర్‌ గా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో స్థానం దక్కించుకుంది. గత ఏడాది నవంబర్‌ 6న విడుదలైన ఈ పుస్తకం నాన్‌ ఫిక్షన్‌ విభాగంలో అన్ని పుస్తకాల విక్రయాల రికార్డులనూ తిరగరాస్తూ 1,50,289 కాపీలు అమ్ముడయ్యింది.

ప్లేయింగ్‌ ఇట్‌ మై వే పుస్తకాన్ని సచిన్‌ బోరియా మజుందార్‌ తో కలిసి రాశారు. ఇది నవంబరులో విడుదల కాగా ఇప్పటికి లక్షన్నర కాపీలు అమ్ముడయ్యాయి. 500 పేజీల ఈ పుస్తకం విశేషంగా ఆదరణ పొందుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు