కేసీఆర్‌ కు గుడి కట్టేశారు

కేసీఆర్‌ కు గుడి కట్టేశారు

అభిమానానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంటారు తమిళ తంబీలు. ఎవరి మీదనైనా వారికి అభిమానం పొంగిపొర్లితే చాలు.. వారిని ఎంతగా ఆదరిస్తారో.. అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాము అమితంగా ఆరాధించే వారి కోసం గుడులు కట్టేయటం వారికి అలవాటే. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితే నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద అంతులేని అభిమానంతో ఒక వ్యక్తి ఏకంగా గుడిని కట్టేయటం విశేషం.

అదిలాబాద్‌ జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్‌ అనే వ్యక్తి.. తన ఇంటి ముందున్నఆవరణలో కేసీఆర్‌ విగ్రహంతో కూడిన గుడిని నిర్మించారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా వారు ఈ గుడిని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధిచిన గొప్ప దేవుడు కేసీఆర్‌ అంటూ గుండ రవీందర్‌ కీర్తించారు. మరి.. ఈ గుడి వ్యవహారం మీద కేసీఆర్‌ ఎలా స్పందిస్తారో..? ఆయన స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, ఈ విషయంలో చంద్రబాబు కేసీఆర్‌ కంటే ఒకడుగు ముందున్నట్లే అనుకోవాలి. ఆయనకు కొంతకాలం క్రితమే అమరావతిలో గుడి కట్టారు. ఆయనతో కలిసి నడుస్తున్న పవన్‌ కు ఓ కమెడియన్‌ గుడి కడుతున్న విషయం కూడా తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు