ఏపీ గ్రామాలు తెలంగాణకు ఇవ్వమంటున్న కలెక్టర్‌

ఏపీ గ్రామాలు తెలంగాణకు ఇవ్వమంటున్న కలెక్టర్‌

ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. ఏపీకి అవసరమైన కొన్ని మండలాల్ని ఏపీకి బదలాయిస్తూ  కేంద్రం నిర్ణయం తీసుకోవటం.. దీన్ని చట్టబద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు ఇవ్వటానికి ఒప్పుకున్నారంటూ కేసీఆర్‌ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

నిజానికి ఈ అంశంపై ఇప్పటివరకూ ఎలాంటి చర్చ జరిగింది లేదు. అలాంటిదేమీ లేకుండా నేరుగా.. ఏపీకి చెందిన గ్రామాల్ని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు తిరిగి ఇచ్చేస్తానన్నారంటూ తెలంగాణ సీఎం చేసిన ప్రకటనను తాజాగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఖండించారు. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి ఏ సందర్భంలో ఎందుకలా మాట్లాడారో తమకు స్పష్టంగా తెలియదని.. పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం అయిన గ్రామాల్ని తిరిగి తెలంగాణకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

అయినా.. విలీన గ్రామాల్ని తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వటానికి ఓకే చేశారని తెలంగాణ సీఎం పబ్లిక్‌ మీటింగ్‌ లో చెబితే.. అలాంటిదేమీ లేదంటూ ఒక జిల్లా కలెక్టర్‌ ఖండించటం ఏమిటి? కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యపై ఏపీ ముఖ్యమంత్రి నేరుగా ఎందుకు రియాక్ట్‌ కావటం లేదు? సమాధానం ఎందుకు ఇవ్వటం లేదు..?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు