కేసీఆర్‌ ఐడియా బాబుకు నచ్చింది

కేసీఆర్‌ ఐడియా బాబుకు నచ్చింది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌ రావు అనుసరించిన విధానాన్నే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అవుతున్నారా? సంక్షేమ పథకాల అమలుకోసం కేసీఆర్‌ అనుసరించిన వ్యూహాన్నే బాబు సైతం అమల్లో పెట్టేందుకు రెడీ అయిపోయారా అంటే అవుననే సమాధానం వస్తోంది.  

తెలంగాణలో రాష్ట్ర ప్రజల సమగ్ర వివరాలను సేకరించేందుకు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తీరులోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ సమగ్ర సర్వే నిర్వహించి ప్రతి కుటుంబం వివరాలు తెలుసుకోవాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

Also Read: ఆ 'హీరో'కి కేటీఆర్‌ ఎంత పేద్ద ఫ్యాన్‌ అయినా..?

వాల్మీకులను ఎస్టీ జాబితాల్లో చేర్చడంపై, ముస్లిం రిజర్వేషన్లపైనా ఆయా వర్గాల ప్రతినిధులు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. వాల్మీకులను  ఎస్టీల్లో చేర్చడం గురించి, ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్‌ గురించి ఈ సందర్భంగా సదరు నేతలు విన్నవించారు. సావధానంగా విన్న చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని పరిస్థితులు అధ్యయనం చేసేందుకు సమగ్ర కుటుంబ సర్వే అవశ్యమని అభిప్రాయపడ్డారు. తద్వారా ఆయా వర్గాల వారి వివరాలన్నీ తెలుస్తాయని చెప్పారు. ఈ ప్రక్రియకు త్వరలోనే శ్రీకారం చుట్టి అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తామని ప్రకటించారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట ఆందోళనలు జరిగితే రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయే ప్రమాదం ఉందని, పెట్టుబడులు పెట్టేవారు కూడా ఎవరూ ముందుకు రారనే చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు