ముఖ్యమంత్రిని లెక్కచేయని సీఆర్‌

ముఖ్యమంత్రిని లెక్కచేయని సీఆర్‌

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డికి, మంత్రి సి.రామచంద్రయ్యకు అస్సలేమీ పొసగని పరిస్థితి ఏర్పడినది. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని, 2014 ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అని కిరణ్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న సిఆర్‌ అనడం, సిఎంకు ఆగ్రహం తెప్పిస్తున్నాగాని ఏమీ చేయలేకపోతున్నారు ముఖ్యమంత్రిగారు.

 వీరిద్దరి మధ్య వివాదం ముదురిపోయి, శ్రీశైలంలో ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి పర్యటనకు మంత్రిగారు డుమ్మా కొట్టేదాకా వెళ్ళింది. దేవాదాయ శాఖ మంత్రిగా సిఆర్‌ అక్కడికి వెళ్ళి సీఎం కిరణ్‌రెడ్డికి స్వాగతం పలకాలి. కాని అది జరుగలేదు.

ప్రోటోకాల్‌ పాటించకుండా అదికారులు అవమానించారని రామచంద్రయ్య అలకకు కారణంగా కనిపిస్తున్నది. సిఆర్‌ తీరుతో సిఎంకి తీవ్ర అవమానం జరిగినట్టే అనుకోవాల్సి వస్తుంది. ఈ అవమానాన్ని కిరణ్‌రెడ్డి ఎలా భరించగలుగుతున్నారో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు