వ్యభిచారం చేస్కో.. తప్పు కాదు..

వ్యభిచారం చేస్కో.. తప్పు కాదు..

సెక్స్‌ వర్కర్ల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు కమిటీ సంచలన సిఫార్సులు చేయబోతోంది.  పొట్టకూటి కోసం వ్యభిచారాన్ని వృత్తిగా తీసుకోవడం చట్టవ్యతిరేకం కాదని... అయితే, వ్యభిచార గృహం నిర్వహించడం తప్పని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సిఫార్సులు చేయనుంది. ఈ మేరకు అది తన నివేదిక సిద్ధం చేసుకుంది.  2011లో నియమించిన ఈ కమిటీ వచ్చే నెలలో కోర్టు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కమిటీ నివేదికలోని కొన్ని వివరాలు బయటకు వెల్లడయ్యాయి.

ఎక్కడైనా వ్యభిచార గృహాలపై దాడిచేసినప్పుడు ఎవరి బలవంతం లేకుండా వ్యభిచారం చేస్తున్న మహిళలను అరెస్టు చేయరాదని... వారికి జరిమానాలు కూడా వేరాదని ఈ కమిటీ సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది.  సెక్స్‌ వర్కర్ల హక్కులను పరిరక్షించి, వారికి ఉత్తమ వర్కింగ్‌ కండిషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్యానెల్‌ సూచించింది. వేశ్యావృత్తిని భారతదేశం చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించలేదు. కానీ, ప్రస్తుతం ఉన్న కొన్ని చట్టాలతో సెక్స్‌ వర్కర్లు పోలీసుల చర్యలకు గురవుతున్నారు. ఒక వేశ్యాగృహంపై దాడి జరిపినప్పుడు వేశ్యాగృహ నిర్వహణ చట్టవిరుద్ధం కాని, స్వచ్ఛంద లైంగిక కార్యం చట్ట విరుద్ధం కాదు కనుక సెక్స్‌ వర్కర్లను అరెస్టు చేయడం, జరిమానా విధించడం, వేధింపులకు గురి చేయడం మొదలైనవి సరికాదని సుప్రీంకోర్టు ప్యానెల్‌ సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు