ఆ 'హీరో'కి కేటీఆర్‌ ఎంత పేద్ద ఫ్యాన్‌ అయినా..?

ఆ 'హీరో'కి కేటీఆర్‌ ఎంత పేద్ద ఫ్యాన్‌ అయినా..?

సినిమా యాక్టర్లు అంటే చాలు.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఏ రంగంలోని వారైనా అభిమానిస్తుంటారు. విపరీతంగా ఆరాధిస్తుంటారు. ఒకవేళ వయసు మీద పడిన తర్వాత సినిమాలు చూసే వీలు లేకున్నా.. బాల్యంలోనో.. కాలేజీ రోజుల్లోనూ సినిమా యాక్టర్ల మీద అభిమానం కచ్ఛితంగా ఉండనే ఉంటుంది. తాజాగా అలాంటి అభిమాని వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి అయిన కేటీఆర్‌ తాను అభిమానించే కథానాయకుడి గురించి చెప్పుకొచ్చారు.

ఆదివారం జరిగిన సీసీఎల్‌ క్రికెట్‌ టోర్నీ ఫైనల్‌ సందర్భంగా ఉప్పల్‌ స్టేడియం వెళ్లి.. క్రికెట్‌ మ్యాచ్‌ ను చూసిన మంత్రి కేటీఆర్‌ ను ఈ సందర్భంగా మీడియా పలుకరించినప్పుడు.. తన అభిమాన నటుడి గురించి చెప్పుకొచ్చారు. తన చిన్నతనం నుంచి నాగార్జున అంటే చాలా ఇష్టమని.. ఆయనకు తాను చాలా పెద్ద ఫ్యాన్‌ గా చెప్పుకున్నారు. ఇప్పటికి తాను నాగ్‌ సినిమాలు చూస్తుంటానని.. అదే విధంగా వెంకటేశ్‌ ను కూడా అభిమానిస్తానని చెప్పారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాను చిన్నతనం నుంచి అమితంగా ఆరాధించే 'హీరో'కి సంబంధించిన అన్నపూర్ణ భూముల వ్యవహారంలో మాత్రం ఆయన సర్కారు కటువుగా వ్యవహరించటమే కాదు.. నాగ్‌ కు చెందిన ఆస్తుల విషయంలో (ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ) షాక్‌ ల మీద షాక్‌ లు ఇవ్వటం గమనార్హం. ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర మాత్రం కాదన్న చందంగా.. తన అభిమాన హీరో విషయంలో కేటీఆర్‌ వ్యవహరిస్తున్నట్లుగా ఉంది కదూ. ఎంత అభిమాన హీరో అయితే మాత్రం అన్నింటికి ఓకే అనాలా? అని కేటీఆర్‌ అనుకున్నారేమో..? ఏది ఏమైనా తన అభిమాన హీరోకి నోటి వెంట మాట రాని రీతిలో షాకులిచ్చిన ఫ్యాన్‌ గా కేటీఆర్‌ నిలుస్తారనటంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English