మోత్కుపల్లి మాటలకు అర్థం ఏమిటంటారు?

మోత్కుపల్లి మాటలకు అర్థం ఏమిటంటారు?

టీటీడీపీలో పరిస్థితి ఎప్పుడు ఏమవతుందో అర్థం కానట్లుగా తయారైంది. పదవుల్లో ఉండే వారే కాదు.. పదవుల్లో లేనోళ్లు సైతం పార్టీ నుంచి వీడిపోయేందుకు ప్లాన్లు వేస్తున్నారు. గత కొద్దిరోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న (తనను దూరంగా ఉంచుతున్నారని) టీటీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శల్లాంటి వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు తెలంగాణను వదిలేశారని.. ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తెలంగాణలో తాజాగా నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి చంద్రబాబు రావటం లేదన్న విషయం ప్రజల్లోకి వెళ్లిపోయిందని.. వారానికి ఒక రోజు అయినా తెలంగాణకు కేటాయించాలన్నారు. పార్టీ నేతలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తిరగాలన్న మోత్కుపల్లి.. తనను మాట్లాడనీయకుండా తన ఎనర్జీని కాపాడినట్లుగా వ్యాఖ్యానించారు.

తనను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తనను ఈ మధ్యన మీటింగుల్లో ఎక్కడైనా చూశారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఇన్ని మాటలు చెబుతున్న మోత్కుపల్లి ఏం చేయాలనుకుంటున్నారు? తనలోని అసంతృప్తికి తుదిరూపం ఎలా ఇవ్వనున్నారు..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు