డాక్టర్‌ కారు దొరికింది

డాక్టర్‌ కారు దొరికింది

సంచలనం సృష్టించిన డాక్టర్ల కాల్పుల ఉదంతానికి సంబంధించి తాజాగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోరెల్‌ ఆసుపత్రికి సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ ఆసుపత్రి భాగస్వాముల మధ్య చోటు చేసుకున్న విభేదాలు హత్యాయత్నం.. ఆపై సూసైడ్‌ కు దారి తీయటం తెలిసిందే.

డాక్టర్‌ ఉదయ్‌ మీద తుపాకీతో కాల్పులు జరిపిన డాక్టర్‌ శశికుమార్‌.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. అయితే.. తన భర్తను ముందే చంపేసి.. ఆ పై ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం చేస్తున్నారంటూ డాక్టర్‌ శశికుమార్‌ సతీమణి క్రాంతి ఆరోపించారు. ఇదిలా ఉంటే.. తన భర్త  ఇంట్లో నుంచి కారులో వెళ్లారని.. కారు.. ఆయన తన వెంట తీసుకెళ్లిన బ్రీఫ్‌ కేసు కనపడటం లేదని ఆరోపించారు.

ఈ దిశగా విచారణ జరిపిన పోలీసులు.. ఎట్టకేలకు తాజాగా డాక్టర్‌ శశికుమార్‌ కు చెందిన కారును గుర్తించారు. ఈ కారు హిమాయత్‌ నగర్‌ లోని మినర్వా కాఫీ షాపు దగ్గర గుర్తించారు. అంతేకాదు.. ఇదే హోటల్‌ కు వచ్చి.. టిఫిన్‌ చేసి హోటల్‌ నుంచి వెళ్లినట్లుగా సీసీ కెమేరా ఫుటేజ్‌ లో గుర్తించినట్లు చెబుతున్నారు. డాక్టర్‌ శశికి చెందిన కారు దొరికినప్పటికీ.. అతని బ్రీఫ్‌ కేసు లభించకపోవటంపై ఇప్పుడు పోలీసులు దృష్టి పెడుతున్నారు. అదే సమయంలో.. డాక్టర్‌ శశి తన సూసైడ్‌ నోట్‌ లో పేర్కొన్న పేర్లు ఎవరివి? అన్న అంశంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు