తెలుగుదేశంతో కడియం తెగతెంపులు

తెలుగుదేశంతో కడియం తెగతెంపులు

తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు కడియం శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం అధినేతకు షాకిచ్చారు. గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నప్పట్టికీ ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంక ఖండించాల్సిన పనిలేదు. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు కడియం.

తెలంగాణ వాదిగా గుర్తింపు పొందిన శ్రీహరి 1994, 99లలోను వరంగల్‌ జిల్లా స్‌ఏషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఎన్‌.టి.ఆర్‌.క్యాబినెట్‌లో, అలాగే చంద్రబాబు క్యాబినెట్‌ లోను 1994-2004 వరకు మంత్రిగా ఉన్నారు. గత ఏడాది జరిగిన అఖిల పక్ష సమావేశానికి కూడా ఆయన టిడిపి ప్రతినిధిగా హాజరై సమర్దంగా తెలంగాణకు అనుకూలంగా తన వాదన వినిపించారు.

కాని ఆశ్చర్యంగా ఆయనే పార్టీని వీడడం విశేషంగానే ఉంది. తెలంగాణపై టిడిపికి చిత్తశుద్ధి లేదని కడియం ఆరోపించారు. కడియంను కెసిఆర్‌ కుమారుడు కెటిఆర్‌ కలిసి టిఆర్‌ఎస్‌లో రావాలని కూడా ఆహ్వానించారు. కడియంపై తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు చేయడం జరుగుతున్నది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English