చిరు, దాసరి బకరాలయిపోయారా?

చిరు, దాసరి బకరాలయిపోయారా?

కాపుల రిజర్వేషన్‌ ఆధారంగా లబ్దిపొందాలని చూసిన ఆ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు, కేంద్ర మాజీమంత్రులు బకరాలయిపోయారు! మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, మాజీ కేంద్ర మంత్రి- ప్రస్తుత ఎంపీ చిరంజీవిలు కాపుల రిజర్వేషన్‌ పోరాటం ఆధారంగా మైలేజ్‌ పొందాల్సింది పోయి నవ్వులపాలయ్యారు. కాపులకు రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో దీక్ష చేపడుతున్న మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా పయనమయ్యారు.

కిర్లంపూడికి వెళ్లడం కోసం దాసరి నారాయణరావు ఈ ఉదయం రాజమండ్రి చేరుకొని అక్కడే ఓ హోటల్‌లో బసచేశారు. అయితే దాసరిని పోలీసులు హోటల్‌లోనే నిర్బంధించి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విధంగా చేశామని పోలీసులు చెప్పగా...ఈ చర్య సరైంది కాదని దాసరి వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ చిరంజీవి, పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి చేసిన మద్దతు యత్నాలను కూడా పోలీసులు బ్రేక్‌ చేశారు. కిర్లంపూడిలో ఆమరణ దీక్ష చేస్తున్నముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు ఈ ఇద్దరు నేతలు చేరుకున్నారు. అయితే వీరి పర్యటన వివరాలు తెలిసిన పోలీసులు వారిని ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిపివేశారు. సంఘీభావం తెలిపేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పారు.

మరోవైపు ఈ పరిణామాలన్నీ జరుగుతుండగానే ప్రభుత్వంతో చర్చలు సఫలమై ముద్రగడ దీక్ష విరమించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన చిరంజీవి, ముందస్తు ఏర్పాట్లతో వచ్చిన దాసరి పర్యటన విఫలం అయింది. దీక్ష విరమణ సమయంలో వచ్చి ఈ ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు బకరాలయిపోయారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు