కేటీఆర్‌.. ఆ సినిమా తప్పకుండా చూస్తాడట

కేటీఆర్‌.. ఆ సినిమా తప్పకుండా చూస్తాడట

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించడం ఆలస్యం.. సోషల్‌ మీడియాలో జనాలు యాక్టివ్‌ అయిపోయారు. తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటే రావడంపై ఎద్దేవా చేస్తూ 'హైదరాబాద్‌ను నెంబర్‌వన్‌ చేస్తా' అని చంద్రబాబు గతంలో అన్న మాటను గుర్తు చేసి సైటైర్‌ పేల్చారు.

మరోవైపు తండ్రి ఆదేశాల మేరకు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ముందుండి నడిపించి పార్టీకి ఘనవిజయాన్ని సాధించి పెట్టిన కేటీఆర్‌ను కీర్తిస్తూ.. గ్రేటర్‌ కుర్చీని కేసీఆర్‌కు అప్పగిస్తున్న గ్రాఫిక్‌ చేసి దానికి 'నాన్నకు ప్రేమతో' అనే క్యాప్షన్‌ పెట్టి క్రియేటివిటీ చూపించారు జనాలు. ఒక మీడియా అంతా కూడా ఇదే ట్రెండు ఫాలో అయింది. పత్రికల్లో సైతం నాన్నకు ప్రేమతో క్యాప్షన్‌ వాడేశారు. టైమింగ్‌ కలిసి రావడం అంటే ఇదే మరి.

ఇక చివరికి మీడియా వాళ్లు కేటీఆర్‌తో చిట్‌ చాట్‌ సందర్భంగానూ ఈ 'నాన్నకు ప్రేమతో' ప్రస్తావన తెచ్చారు. పనిలో పనిగా ఆ సినిమా చూశారా అని అడిగారు. కానీ ఎన్నికల్లో బిజీగా ఉండి చూడలేకపోయానని.. కాస్త వీలు చూసుకుని తప్పకుండా 'నాన్నకు ప్రేమతో' చూస్తానని సెలవిచ్చాడు కేటీఆర్‌.

కేసీఆర్‌ తనయుడికి సినిమాల మీద బాగానే ఆసక్తి ఉంది. అప్పుడప్పుడూ కుటుంబంతో కలిసి సినిమాలకు వెళ్తుంటాడు. ఈ మధ్య 'చీకటి రాజ్యం' ప్రిమియర్‌ షోకు కూడా హాజరై కమల్‌ పక్కన కూర్చుని సినిమా చూశాడు. తనకు తానుగా థియటర్లకు వెళ్లి 'నాన్నకు ప్రేమతో' చూడాలనుకుంటే మాత్రం ఆయన కొంచెం త్వరపడాలి. ఎందుకంటే ఆ సినిమాను థియేటర్ల నుంచి తీసేసే రోజులు దగ్గరపడ్డాయి. అలా కాదంటే నిర్మాతకు ఒక ఫోన్‌ కొడితే స్పెషల్‌ షో రెడీ అయిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English