ఆంధ్రోళ్లకు టీఆర్‌ఎస్‌ టిక్కెట్లు అమ్మిందా?

ఆంధ్రోళ్లకు టీఆర్‌ఎస్‌ టిక్కెట్లు అమ్మిందా?

గ్రేటర్‌ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల షాక్‌ నుంచి తేరుకున్న టీతమ్ముళ్లు ఇప్పుడు తమ తర్వాత లక్ష్యమైన నారాయణఖేడ్‌ మీద దృష్టి సారిస్తున్నారు. దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా వచ్చిన గ్రేటర్‌ ఫలితాన్ని చూసిన కంగుతిన్న తమ్ముళ్లు.. ఇప్పుడా షాక్‌  నుంచి తొందరగానే బయటపడ్డారు. తాజాగా మెదక్‌ జిల్లా నారాయణ్‌ ఖేడ్‌ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పుడా ఎన్నిక మీద మరింత ఫోకస్‌ పెంచారు. పార్టీకి చెందిన పలువురు నేతల్ని ప్రచారంలోకి దించారు.

అలా ప్రచారగోదాలోకి దిగిన టీటీడీపీ ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి తాజాగా తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ తెలంగాణలో పుట్టిన పార్టీ అని.. తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న పార్టీగా రేవంత్‌ పేర్కొన్నారు. తెలంగాణ పార్టీగా చెప్పుకునే టీఆర్‌ఎస్‌ నేతలు.. గ్రేటర్‌ ఎన్నికల్లో దాదాపు 20 మంది ఆంధ్రోళ్లకు టిక్కెట్లు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

వెంగళరావు నగర్‌.. జూబ్లీహిల్స్‌.. అమీర్‌ పేట.. దిల్‌ సుఖ్‌ నగర్‌ తదితర డివిజన్లో టిక్కెట్లు ఇచ్చిన వారంతా ఎవరని? ఎక్కడి వారని రేవంత్‌ ప్రశ్నించారు. ఆంధ్రోళ్లకు పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారంటూ రేవంత్‌ చేసిన ఆరోపణలపై తెలంగాణ అధికారపక్షం ఏ తీరులో రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు