ఎంఐఎంకు ఎందుకు వణుకు పుడుతోంది?

ఎంఐఎంకు ఎందుకు వణుకు పుడుతోంది?

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఇపుడు కొత్త ఆలోచనలను తెరమీదకు తెస్తుంది. సునామీని తలపించేలా వచ్చిన గెలుపుతో టీఆర్‌ఎస్‌ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. మ్యాజిక్‌ ఫిగర్‌ ఆలోచన కూడా చేయనంత ఘనవిజయాన్ని టీఆర్‌ఎస్‌ సాధించింది. టీఆర్‌ఎస్‌ తను సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉన్న ఎక్స్‌ అఫిషియో ఓట్ల అవసరం కూడా పడనంత స్థాయిలో విజయం దక్కింది. ఇక పొత్తుల అవసరం లేనే లేదు. అయితే ఈపరిణామమే కొత్త ఆలోచనను తెరమీదకు వస్తోంది.

అధికార పార్టీతో అంటకాగడంలో ముందుండే ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కు సరిపడా సీట్లు రావని భావించింది. ఆ మేరకు మద్దతు ఇచ్చి కళ్లెం తన చేతుల్లో పెట్టుకొని గ్రేటర్‌లో చక్రం తిప్పాలని ఎత్తులు వేసింది. అయితే ఓటింగ్‌ సమయంలోనే సీన్‌ రివర్స్‌ అయింది. టీఆర్‌ఎస్‌ గెలుపు ఖరారుగా కనిపించడంతో అసహనంతో దాడులకు పాల్పడింది. ఈ దాడుల విషయంలో సీఎం కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరించారు. ఏకంగా తమ ఉపముఖ్యమంత్రి ఇంటిపై దాడి చేసినప్పటికీ సంయమనంతో వ్యవహరించి తనతో పాటు పార్టీ నేతలు సైతం స్పందించే క్రమంలో ఒకింత కట్టడిని పాటించారు.

కానీ ఇపుడు టీఆర్‌ఎస్‌కు తన మేయర్‌ను ఎన్నుకునే స్థాయిలో సీట్లు దక్కడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడుగులు కచ్చితంగా ఎంఐఎంపై కఠినంగా వ్యవహరించేలా ఉంటాయని చెప్తున్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ సీఎం కేసీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో భాగంగా తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ తగు అడుగులు వేస్తారని చెప్తున్నారు. మద్దతు కోసం ఎంఐఎంను దువ్వినట్లు వ్యవహరించినప్పటికీ ఇపుడు కేసీఆర్‌ తన చర్యలతో ఎంఐఎం జుట్టు తన చేతిలో ఉంచుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు