బాలకృష్ణ పదవి పోయే ఛాన్సుందా?

బాలకృష్ణ పదవి పోయే ఛాన్సుందా?

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తెలంగాణ పరిధిలోకి వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ టీ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించి గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటువేశారని పొన్నం కంప్లైంట్‌ చేశారు. బాలకృష్ణ ఓటు వేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని..ఎన్నికల నియమావళి ప్రకారం శాసనసభ్యుడిగా అనరులుగా ప్రకటించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రెండు రోజుల పాటు సైలెంట్‌ గా ఉన్న పొన్నం ఇవాళ ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తున్న అంశంపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పడం మరింత ఇంట్రెస్టింగ్‌ విషయంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు